.ములుగు పోలీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కానిస్టేబుల్ గడ్డం క్రాంతి కుమార్ ఎన్నిక.
.నిజాయితీగా పారదర్శకంగా పనిచేయాలని ఎస్పీ గారు పిలుపు.
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):-
జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సభ్యులను ఎస్పీ గారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేది కేవలం ఒక సంఘం మాత్రమే కాకుండా, పోలీసు అధికారుల సంక్షేమం, పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, సేవా నిబద్ధతను మరింత బలోపేతం చేసే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బంది, అధికారులు ఎదుర్కొనే సమస్యలను బాధ్యతాయుతంగా గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా అసోసియేషన్ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని, పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచేలా తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు.
జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం:
• అధ్యక్షుడు: గడ్డం క్రాంతి కుమార్ (కానిస్టేబుల్)
• ఉపాధ్యక్షులు: తాజుద్దీన్ (ఎస్ ఐ ఆఫ్ పోలీస్), కృష్ణ ప్రసాద్ (ఎస్.ఐ.)
• కార్యదర్శి: దారం సురేష్ కుమార్ ( ఇన్‌స్పెక్టర్)
• జాయింట్ సెక్రటరీ: పసుపులేటి నరేష్ (హెడ్ కానిస్టేబుల్)
• ఆర్గనైజింగ్ సెక్రటరీ: విజయ్ (హెడ్ కానిస్టేబుల్)
• (ట్రెజరర్): సర్వేశ్వర్ రావు (కానిస్టేబుల్)
యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు..
• అనిల్ కుమార్ (కానిస్టేబుల్)
• రాజీవ్ (కానిస్టేబుల్)
• స్వప్న యాదవ్ (కానిస్టేబుల్)
• శోభన్ (కానిస్టేబుల్)
• తిరుపతి (హెడ్ కానిస్టేబుల్)
•శంకర్ (కానిస్టేబుల్)
ఈ కార్యక్రమంలో సీఐ దారం సురేష్ ఎస్సై కృష్ణ ప్రసాద్ ఎస్సై తాజుద్దీన్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గడ్డం క్రాంతి , ఉపాధ్యక్షులు,కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.