జిల్లాలో ఇంధన కొరత లేదు: తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు.. -సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు.

కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్ధిపేట ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ సిద్దిపేట, మార్చి 25, ప్రజావాణి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ గారు స్పష్టం చేశారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో సరఫరా ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజలు అనవసర ఆందోళనకు గురై ఒకేసారి బంకులకు చేరుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు సాధారణ పంపిణీకి అంతరాయం కలుగుతుందని సిపి గారు తెలిపారు.సోషల్ మీడియాలో వచ్చే వదంతులను...