సిద్దిపేట్, ఏప్రిల్ 20, ప్రజావాణి
హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామంలో గల గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ఆకస్మికంగాసందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఈ వారం థీమ్ వెల్ఫేర్ వీక్ కార్యాచరణలో జిల్లాలోని అన్ని సంక్షేమ విద్యాసంస్థలలోవంటశాలలు, శానిటేషన్ పై సమగ్ర శుభ్రత, పరిశుభ్రత ప్రమాణాలను ప్రణాళిక ప్రకారం అమలు పరచడం కోసం జిల్లా అదికార యంత్రాంగం నోడల్ అధికారులను నియమించి అన్ని గురుకుల సంక్షేమ విద్యాసంస్థలను సందర్శింప చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సంక్షేమవిద్యాసంస్థల్లో శానిటేషన్ డ్రైవ్ గూర్చి అవగాహన కల్పిస్తూ, పగడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.శానిటేషన్ డ్రైవ్ లో విద్యార్థులకు మంచిక్రమశిక్షణ తో కూడిన అలవాట్లను అలవర్చుకోవాలని ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గురుకుల ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. వరండా మరుగుదొడ్లు వంటశాలను వెంటనే శుభ్రంగా కడగాలని ఆదేశించారు. వంట గదికి వెళ్లి ఆహారపదార్థాలను తనిఖీ చేశారు. అన్నం, పాలకూర పప్పు, బెండకాయ కర్రీ, రసం లను పరిశీలించగా పాలకూర పప్పు ఇంత పలచగా ఉండకూడదని పచ్చి పులుసు చేసి రసం అని చెప్పడం ఏంటని వంట సిబ్బందిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ లో పచ్చీపులుసు ఎక్కడుందని ఎందుకు వండారని మండిపడ్డారు. పచ్చీపులుసు పిల్లలకు పెట్టకూడదని తీసెయ్యాలని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదనిసక్రమంగానిర్వహించాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట ఆర్డీఓ రామ్మూర్తి, ప్రిన్సిపల్ రాజు తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గల అన్ని గురుకుల విద్యాసంస్థలు, ఎస్సీ, ఎస్టీ, బీసీసంక్షేమవసతిగృహాలకునియమించిన నోడల్ అధికారులు ఆయా ఆస్తులను సందర్శించి వసతులను పరిశీలించి జిల్లా అధికార యంత్రంగానికి నివేదికలు అందజేశారు..
