prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 4:06 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

జిల్లాలోని అన్ని ప్రభుత్వ మాతా-శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణి మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి సూచించారు..

 

సిద్దిపేట్, ఏప్రిల్ 8,ప్రజావాణి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ మాతా-శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణి మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి సూచించారు.బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన “సేఫ్ మదర్ డే” కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏప్రిల్ 6 నుండి 11 వరకు హెల్త్ వీక్‌గా నిర్వహిస్తూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు జననం వరకు తల్లి-శిశువుల ఆరోగ్యాన్ని కాపాడడం ఈకార్యక్రమంముఖ్యఉద్దేశమనిపేర్కొన్నారు.గర్భిణులు వైద్యుల సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. గర్భధారణ నిర్ధారణ అయిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని, 7వ, 8వ, 9వ నెలల్లో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని, ప్రసవం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించుకోవాలని సూచించారు.గర్భిణుల ఆరోగ్యానికి భర్తలు మరియు కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. ధనరాజ్, సైకియాట్రి విభాగం హెచ్‌వోడి డా. శాంతి, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. బాబ్జి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. మహేందర్ రెడ్డి, నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం జిల్లా జనరల్ ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రిస్ట్, డి అడిక్షన్ సెంటర్ లో కుటుంబ సమస్యలతో సతమతమవుతూ డిప్రెషన్ కి గురవుతున్న రోగి తో మాట్లాడారు. జీవితం చాలా గొప్పదని, కష్టసుఖాలు ఎదుర్కొని జీవితంలో నిలదొక్కోవాలని, మానసికంగా దృఢంగా ఉండాలని సమస్యలకు తలగ్గొద్దని, చదువుతో పాటు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, మానసిక వైద్య నిపుణులు తెలిపిన ప్రతిదీ పాటిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని తెలిపారు.