జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఘన సత్కారం

ఘట్‌కేసర్, జూలై 1: జాతీయ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి. కిరణ్ కుమార్, డాక్టర్ మేకల శ్రీనివాస్ రావు, డాక్టర్ ప్రసాద్‌లకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, సమాజానికి వారు చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్...