జాతీయ లోక్ అదాలత్‌లో 11,193 కేసుల పరిష్కారం..
సిద్ధిపేట, మార్చి 29, ప్రజావాణి
సిద్ధిపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసుల పరిష్కారంలో విశేష ఫలితాలు సాధించబడినట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,ఐపిఎస్, ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 11,193 కేసులు పరిష్కరించబడినట్లు పేర్కొన్నారు. వాటిలో:ఐపీసీ కేసులు – 733,డీడీ,కేసులు – 7995,ఈపెట్టీ, కేసులు – 2465,ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు సిపి వెల్లడించారు.జాతీయ లోక్ అదాలత్ ద్వారా వివాదాలను స్నేహపూర్వకంగా, వేగవంతంగా పరిష్కరించుకోవడం వల్ల ప్రజలకు సమయం, ధనం ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలు ఈ విధమైన అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో తెలంగాణలోని హైదరాబాద్ , మల్కాజిగిరి జిల్లాల తర్వాత మూడోవ స్థానంలో సిద్దిపేట జిల్లా అత్యధిక సంఖ్యలో కేసుల పరిష్కారాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచిందని,ఈ విజయవంతమైన కార్యక్రమానికి సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, సిబ్బంది మరియు సంబంధిత శాఖలందరికీ సిపి అభినందనలు తెలిపారు.