prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 1:59 pm Digital Edition : RAJASHEKARREDDY

జాతీయ మత్స్యకారుల దినోత్సవాన ముదిరాజ్‌ల ఆవేదన.. ఇథనాల్ కాలుష్యంతో చేపల వనరులకు ముప్పు ముదిరాజ్ హక్కుల పోరాట సమితి నాయకులు-కొరివి తిరుపతి

బెజ్జంకి, జూలై 10(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీల కాలుష్యం తమ జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, నర్సింహులపల్లి గ్రామాల ముదిరాజ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు దాచారం మీదుగా తోటపల్లి ప్రాజెక్ట్‌లోకి చేరుతున్నాయని, అక్కడి నుంచి బ్యాక్‌వాటర్ కాలువల ద్వారా మిడ్ మానేరుకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. అలాగే మోయ తుమ్మెద వాగు ద్వారా మానేరు డ్యాం కూడా కాలుష్య ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఈ కాలుష్యం కారణంగా చేపల సంపద తగ్గిపోతుండటంతో మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని, జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని సైతం ఆనందంగా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇథనాల్ ఫ్యాక్టరీల వ్యర్థ జలాల విడుదలను వెంటనే అరికట్టి, జల వనరులను పరిరక్షించేలా ప్రభుత్వం మరియు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ముదిరాజ్‌లు డిమాండ్ చేశారు.