జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గాగిల్లాపూర్‌లో గ్రామ సభ నిర్వహణ

  బెజ్జంకి, ఏప్రిల్ 24(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ సభను పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ యొక్క గ్రామ సభకు పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని సమస్యలు పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి విద్యుత్ దీపాలు, తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి సేకరణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర జానకి రాజు, ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ, జిపి...