prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 6:07 am Digital Edition : RAJASHEKARREDDY

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గాగిల్లాపూర్‌లో గ్రామ సభ నిర్వహణ

 

బెజ్జంకి, ఏప్రిల్ 24(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ సభను పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ యొక్క గ్రామ సభకు పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని సమస్యలు పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి విద్యుత్ దీపాలు, తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి సేకరణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర జానకి రాజు, ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ, జిపి కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్, వార్డు సభ్యులు సొల్లు బాలయ్య, చింతలపల్లి లత, కళ్ళపల్లి లక్ష్మి, ఆశా వర్కర్ తృతీయవర్ణ, సి.ఏ మంజులతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.