జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పోరుమామిళ్ల వైద్యులకు ఘన సత్కారం మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో “గోల్డెన్ స్టెతస్కోప్ అవార్డు – 2026” ప్రదానం

పోరుమామిళ్ల,జూలై 02 ప్రజావాణి జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పోరుమామిళ్ల మండలంలో వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులను మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో"గోల్డెన్ స్టెతస్కోప్ అవార్డు 2026"తో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు మొమెంటోలు,ప్రశంసా పత్రాలు (సర్టిఫికెట్లు) మరియు జ్ఞాపికలను అందజేశారు.ఫౌండేషన్ ట్రెజరర్ చిత్తా ప్రజ్వల రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ,తాను మరియు తన భర్త ఇద్దరూ వైద్యులమే కావడంతో డాక్టర్ల కష్టసుఖాలు బాగా తెలుసని అన్నారు.వైద్య వృత్తి...