పోరుమామిళ్ల,జూలై 02 ప్రజావాణి జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పోరుమామిళ్ల మండలంలో వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులను మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో”గోల్డెన్ స్టెతస్కోప్ అవార్డు 2026″తో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు మొమెంటోలు,ప్రశంసా పత్రాలు (సర్టిఫికెట్లు) మరియు జ్ఞాపికలను అందజేశారు.ఫౌండేషన్ ట్రెజరర్ చిత్తా ప్రజ్వల రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ,తాను మరియు తన భర్త ఇద్దరూ వైద్యులమే కావడంతో డాక్టర్ల కష్టసుఖాలు బాగా తెలుసని అన్నారు.వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం చేసే ఉద్యోగం కాదని,సేవాభావం కలిగిన వారే నిజమైన వైద్యులుగా నిలుస్తారని పేర్కొన్నారు.సమాజానికి విశేష సేవలు అందిస్తున్న వైద్యులను గుర్తించి గౌరవించడం అభినందనీయమని,ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మదర్ థెరెసా ఫౌండేషన్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.అతిథులుగా పాల్గొన్న పోరుమామిళ్ల మండల జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మరియు మండల వైస్ ఎంపీపీ సి.ఎం.భాషా మాట్లాడుతూ,పూర్వం నుంచి మారుమూల గ్రామాల్లోనూ వైద్యులు సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని,వారి సేవలను పోరుమామిళ్ల ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.అవార్డు గ్రహీతల తరఫున మాట్లాడిన సీనియర్ వైద్యులు డాక్టర్ రాజేశ్వరమ్మ,డాక్టర్ కె.షెనోయ్,డాక్టర్ ఎస్.కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ,27 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మదర్ థెరెసా ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థ నుంచి గోల్డెన్ స్టెతస్కోప్ అవార్డు –2026 అందుకోవడం తమ జీవితంలో ఒక మధురమైన ఘట్టమని అన్నారు.ఈ గౌరవాన్ని అందించిన ఫౌండేషన్ చైర్మన్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి మరియు కో-చైర్మన్ చిత్తా గిరి ప్రణీత్ రెడ్డిలను అభినందించారు.ఈ కార్యక్రమంలో పోరుమామిళ్లకు చెందిన ప్రముఖులు తులసి సురేష్,చెన్ను రాజశేఖర్,చాపాటి నారాయణరెడ్డి,దూల రఘునాథరెడ్డి,కె.పి.సుబ్బారెడ్డి,ఇండ్ల చెన్నారెడ్డి,బోయ సంఘం అధ్యక్షులు మనం ఆంజనేయులు,ఓఎల్ఎఫ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అదూరి ఆరోగ్య రాణి, విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి,రాజారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు,వైద్యులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు