prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 2:27 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జాగ్రత్త.. మోసగాళ్లు ఉన్నారు..!!

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్15) విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం ‘ట్రివియల్ చాప్టర్’ గ్యాంగ్ బట్టబయలు, ఇద్దరు అరెస్ట్,విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాళ్లను Jubilee Hills Policeలు ఛేదించారు.“ట్రివియల్ చాప్టర్” పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కీలక సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.గ్రీస్,రొమేనియా వంటి యూరోపియన్ దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ గ్యాంగ్ అభ్యర్థులను ఆకర్షించింది.ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసింది.డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి, అనంతరం బాధితులతో అన్ని రకాల కమ్యూనికేషన్ నిలిపివేసింది.ఈ గ్యాంగ్ Instagram,Facebook వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి ఓ ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలా నటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన రిక్రూట్‌మెంట్ ఏజెంట్ (RA) లైసెన్స్ లేకపోయినా ఉన్నట్టు మోసం చేసింది.నమ్మకం కలిగించేందుకు ఆన్‌లైన్ టెంప్లేట్లతో నకిలీ “వర్క్ ఆథరైజేషన్” లెటర్లు తయారు చేసింది.ఈ కేసులో లంకా నిరూపమ (A7)– వైస్ ప్రెసిడెంట్ (సౌత్ జోన్),మామిడి అరుణ్ రాజ్ (A8)–రీజినల్ మేనేజర్ (తెలంగాణ)ను పోలీసులు అరెస్టు చేసారు.ఈ కేసులో మరో 8 మంది పరారీలో ఉన్నారు.వీరిలో సంస్థ ఫౌండర్, సీఈఓ, వీసా విభాగాధిపతి కూడా ఉన్నారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ సంస్థ గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.