prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 7:39 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జర్నలిస్ట్ బాలరామిరెడ్డి మృతి బాధాకరం :రవీంద్రారెడ్డి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) సీనియర్ జర్నలిస్ట్ బాలరామి రెడ్డి మృతి పట్ల బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి సంతాపం తెలిపారు.సోమవారం ఆయన స్వగ్రామం వెంకటాపురం వెళ్లి బాలరామి రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.బాలరామి రెడ్డి, జర్నలిజం రంగానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.ఎన్నో దశాబ్దాలుగా నిజాయితీ,నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు.సమాజ శ్రేయస్సు కోసం,బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలిచారు.యువ జర్నలిస్టులకు మార్గదర్శకంగా నిలిచిన ఆయన లేని లోటు పాత్రికేయ లోకానికి తీరనిది”అని అన్నారు.
బాలరామి రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.రవీంద్రారెడ్డి వెంట స్థానిక నాయకులు,పలువురు జర్నలిస్టులు ఉన్నారు.