జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అమలు చేయాలి,,ఏపీయూడబ్ల్యూజే డిమాండ్

అనంతపురం (జూన్ 06) ప్రజావాణి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్నేళ్లుగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో అమలు అవుతున్న ఉచిత విద్యా సదుపాయాన్ని ఈ విద్యా సంవత్సరంలో కూడా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు డిమాండ్ చేశారు.యూనియన్ జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆయుఫ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) ప్రకారం...