జర్నలిస్టుపై బెదిరింపులు: సింగల్ విండో ప్రెసిడెంట్ పై కేసు నమోదు

వైయస్సార్ కడప జిల్లా (మే 25) ప్రజావాణి పోరుమామిళ్ల:జర్నలిస్టుపై దుర్భాషలాడి, ప్రాణభీతి కలిగించేలా బెదిరింపులకు పాల్పడిన పోరుమామిళ్ల సింగిల్ విండో ప్రెసిడెంట్ కల్లూరి వెంకట కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మైదుకూరు డీఎస్పీ ఆదేశాల మేరకు పోరుమామిళ్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోరుమామిళ్లకు చెందిన సీనియర్ రిపోర్టర్ దియ్యాల శ్రీనివాసులు ప్రైమ్ 9 టీవీలో పోరుమామిళ్ల, కలసపాడు,బి.కోడూరు, శ్రీ అవధూత కాశినాయన మండలాల రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.కాగా, పోరుమామిళ్ల సింగిల్ విండో ప్రెసిడెంట్‌గా ఉన్న కల్లూరి వెంకట కృష్ణారెడ్డి, ప్రైమ్ 9...