prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 3:29 pm Digital Edition : PRAJA VANI

జయముఖి కళాశాల సమీపంలో ఘోర ప్రమాదం* డీసీఎం ఢీకొని సైక్లిస్ట్ మృతి.

*జయముఖి కళాశాల సమీపంలో ఘోర ప్రమాదం*

 

డీసీఎం ఢీకొని సైక్లిస్ట్ మృతి.

 

 

చెన్నారావుపేట మార్చి 30 (ప్రజావాణి)

 

 

నర్సంపేట – నెక్కొండ ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జయముఖి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఒక సైకిలిస్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల కథనం ప్రకారం.. నెక్కొండ వైపు నుంచి నర్సంపేట వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ జయముఖి కళాశాల వద్దకు రాగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న సైకిలిస్టును ఢీకొట్టింది. డీసీఎం వేగం ఎక్కువగా ఉండటంతో సైకిల్‌పై ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలు అయ్యి రక్తస్రావం ఎక్కువగా జరగడంతో బాధితుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది