జయభేరి ఆధ్వర్యంలో మారుతి సుజుకి నూతన బ్రీజా కారు విడుదల

ఘట్‌కేసర్, జూలై 30: ఘట్‌కేసర్ 6వ డివిజన్ పరిధిలోని శివారెడ్డిగూడలో జయభేరి వారి ఆధ్వర్యంలో మారుతి సుజుకి సంస్థ నూతన వేరియంట్ బ్రీజా కారును గురువారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, ఘట్‌కేసర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ హాజరై నూతన వాహనాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలు, మెరుగైన పనితీరుతో కూడిన వాహనాలను అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ...