prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:34 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

జయభేరి ఆధ్వర్యంలో మారుతి సుజుకి నూతన బ్రీజా కారు విడుదల

ఘట్‌కేసర్, జూలై 30: ఘట్‌కేసర్ 6వ డివిజన్ పరిధిలోని శివారెడ్డిగూడలో జయభేరి వారి ఆధ్వర్యంలో మారుతి సుజుకి సంస్థ నూతన వేరియంట్ బ్రీజా కారును గురువారం మార్కెట్లోకి విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, ఘట్‌కేసర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ హాజరై నూతన వాహనాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలు, మెరుగైన పనితీరుతో కూడిన వాహనాలను అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ జంపాల రమేష్, మాజీ పీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం, ఎస్‌.ఎం. సైదా, ఏఎస్‌ఎం నవీన్, ప్రవీణ్, టీం లీడర్లు నాగేష్, భరత్, శ్రవణ్, రవి, శరత్, ఆర్‌ఎంలు బొక్క సత్తిరెడ్డి, బాబురావు, బొక్క సుధాకర్ రెడ్డి, సాయి యాదవ్, నరసింహారెడ్డి, హరికాంత్ రెడ్డి, పూల సతీష్, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.