prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 3:28 pm Digital Edition : NAVEEN NADIKUDA

జమ్మికుంట మండలం ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం

జమ్మికుంట మండలం ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం

 

ప్రజావా ణి జమ్మికుంట ఆగస్టు 3

 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ఇన్‌చార్జి తునికి వసంత్ మాదిగ ఆధ్వర్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు.

 

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ మాట్లాడుతూ, జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన గ్రామ కమిటీల ఏర్పాటు, మండల కమిటీ బలోపేతం, జెండా గద్దెల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రాంచెంద్రం మాదిగ, రాష్ట్ర నాయకులు మారపెల్లి శ్రీనివాస్ మాదిగ, కేశవపట్నం మండల ఇన్‌చార్జి దేవునూరి రవీందర్ మాదిగ, హుజూరాబాద్ మండల ఇన్‌చార్జి ఎర్ర ఆదిత్య మాదిగ, సైదాపూర్ మండల ఇన్‌చార్జి మిట్టపల్లి రాజేష్ మాదిగ, మోలుగూరి అశోక్ మాదిగ, మోతే మహేందర్ మాదిగ, మోతే స్వామి మాదిగ, దొడ్డే అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.