నెల్లూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్20) నెల్లూరు నగరం 22వ డివిజన్‌లో ఇళ్లపై కార్పొరేషన్ నోటీసుల అంశంపై స్పష్టీకరణ అని భరోసా ఇచ్చిన హ్యాట్రిక్ రూరల్ నాయకత్వం అభినందనీయం“తెల్లవారు జామున 3 గంటలకు నీటి సరఫరా ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండేలా పనిచేయండి అంటూ అధికారులకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కిషోర్ గునుకుల -జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలోని 22వ డివిజన్ పరిధిలో బి.వి.నగర్, కొండాయపాలెం ప్రాంతాలలో దాదాపు 40 సంవత్సరాలు పైగా నివాసం ఉంటున్న సుమారు 59 కుటుంబాలకు ఇటీవల నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇళ్లు నిర్మాణానికి అప్పట్లో మున్సిపల్ అనుమతులతో ప్లాన్‌లు తీసుకొని నిర్మించబడినవే కాకుండా,ఇళ్ల యజమానులు పలు దశాబ్దాలుగా హౌస్ టాక్స్,వాటర్ టాక్స్ తదితర పన్నులు చెల్లిస్తూవస్తున్నారు.ఇటీవల ఒక వ్యక్తిగత పిటిషన్ నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు,సంబంధిత స్థలంపై వివరణలు కోరుతూ కార్పొరేషన్ అధికారులు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో,వారు జనసేన పార్టీ నాయకత్వాన్ని ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో,స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్న అనంతరం,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వారి సోదరులు వెంటనే స్పందించి బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న అనేక మందికి పట్టాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని,ప్రజల నివాస హక్కులను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.అలాగే,ఈ విషయంపై కమిషనర్తో మరియు న్యాయ నిపుణులతో చర్చించి,ఒక్కరి సమస్య కోసం 59 కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయకుండా,అవసరమైతే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. సంబంధిత సమస్యకు చట్టపరంగా సరైన పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ సందర్భంగా స్థానికులు తమ ప్రాంతంలో ఉన్న పలు ప్రాథమిక సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ముఖ్యంగా:చెత్త నిర్వహణలో లోపాలు కాలువల సమస్యలు తాగునీటి సరఫరా సమయాల్లో ఇబ్బందులు ఈ సమస్యలపై కూడా సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.ఇకపై ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని, ఇందుకోసం తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను కూడా స్థానికులకు అందజేసి,ఎప్పటికప్పుడు స్పందిస్తానని హామీ ఇచ్చారు.ఈ చర్యలతో స్థానిక ప్రజలు కొంత ఊరట పొందుతూ,తమ సమస్యలను పట్టించుకున్నందుకు ఎమ్మెల్యే గారికి మరియు జనసేన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం బి.వి.నగరంలోని చిన్న కేఎన్ఆర్ స్కూల్‌లో నిర్వహించబడింది. అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ని కలవటం జరిగింది.
జనసేన 21-22వ డివిజన్ మరియు క్లస్టర్ నాయకుడు పసుపులేటి శరవణ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,జిల్లా సమయక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, నెల్లూరు నగర నాయకులు, 28వ డివిజన్ బ్లూ బర్డ్ సెక్యూరిటీస్ అధినేత వేముల శివకృష్ణ,జెన్ జీ నాయకులు హర్ష, 41వ డివిజన్ నాయకులు కార్ 24 ట్రావెల్స్ అధినేత కర్రెద్దుల అశోక్, 48వ డివిజన్ నాయకుడు వీల్స్ ఆన్ ఐ ప్రతినిధి చిత్తూరు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు