prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 3:01 pm Digital Edition : NAVEEN NADIKUDA

జనగామ జిల్లా రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ధనుంజయ్ దుర్మరణం

జనగామ జిల్లా: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ధనుంజయ దుర్మరణం

 

ప్రజావాణి జనగామ ఆగస్టు5

 

జనగామ జిల్లా కోమల–జనగామ మధ్య ఉన్న టోల్‌గేట్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ధనుంజయ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితం వరకు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన ధనుంజయ మృతి పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది.

 

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.