జనగణన సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలి – అద్దె నివాసితులు తప్పనిసరిగా వివరాలు నమోదు చేయించుకోవాలి*
ప్రజావాణి న్యూస్ (మే14) దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న జనగణన కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా మరియు నివాస పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరించే అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమమని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక, మౌలిక వసతుల కల్పన వంటి అనేక అంశాలకు జనగణన ద్వారా సేకరించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.జనగణన ప్రక్రియలో భాగంగా నియమించబడిన ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు,నివాస పరిస్థితులు,విద్య,ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు....