జగన్‌మోహన్‌రెడ్డి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి..ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ముత్యాల ప్రసాద్ రావు**  

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 29)పోరుమామిళ్ల,చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్‌మోహన్‌రెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అమానుష ఘటనను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు తీవ్రంగా ఖండించారు. నడిరోడ్డుపై పాశవికంగా జర్నలిస్టును హత్య చేయడం ప్రజాస్వామ్యానికి నేరుగా ముప్పని ఆయన వ్యాఖ్యానించారు.ముత్యాల ప్రసాద్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ప్రజలకు నిజం తెలియజేసే జర్నలిస్టులకే రక్షణ...