prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 12:10 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జగన్‌మోహన్‌రెడ్డి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి..ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ముత్యాల ప్రసాద్ రావు**  

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 29)పోరుమామిళ్ల,చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్‌మోహన్‌రెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అమానుష ఘటనను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు తీవ్రంగా ఖండించారు. నడిరోడ్డుపై పాశవికంగా జర్నలిస్టును హత్య చేయడం ప్రజాస్వామ్యానికి నేరుగా ముప్పని ఆయన వ్యాఖ్యానించారు.ముత్యాల ప్రసాద్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ప్రజలకు నిజం తెలియజేసే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు.జగన్‌మోహన్‌రెడ్డి హత్య వెనుక ఉన్న కుట్రను పోలీసులు త్వరితగతిన వెలికితీసి, నిందితులు ఎంతటి ప్రభావశీలులైనా సరే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ ఘటనలో పాల్గొన్న నిందితులకు ఉరశిక్ష విధించాలి అని ఘాటుగా డిమాండ్ చేశారు.అదే విధంగా రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రత కోసం వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, మహారాష్ట్ర తరహాలో జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు చేయాలని సూచించారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీలను ఏర్పాటు చేసి, అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని అన్నారు. జర్నలిస్టులపై దాడులు ఆగాలంటే కఠిన చర్యలు తప్పనిసరి. ఒక్క ఘటనను కూడా ఉపేక్షించకూడదు. నిందితులకు శిక్షలు ఖచ్చితంగా పడేలా ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరించాలి,అని ముత్యాల ప్రసాద్ రావు హెచ్చరించారు.చివరగా హత్యకు గురైన జర్నలిస్టు జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం మరియు భద్రత కల్పించాలని ఆయన కోరారు.