prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:17 pm Digital Edition : ELKATHURTHI

జగన్నాథ్‌పూర్‌లో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

జగన్నాథ్‌పూర్‌లో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

మండలంలోని జగన్నాథ్‌పూర్ గ్రామంలో వడ్డెర సంఘం గ్రామ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు వల్లేపు సుధాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు బొంత రమేష్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొలేన ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించరు ఈ కార్యక్రమానికి ఎల్కతుర్తి పట్టణ అధ్యక్షులు ఓర్సు కుమారస్వామి ప్రధాన కార్యదర్శి అల్లెపు ప్రశాంత్ కోశాధికారి అల్లెపు రాజు హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు.గోపాల్ పూర్ గ్రామ అధ్యక్షులు సూర మొగిలి ఉపాధ్యక్షులు గండికోట జంపయ్య ప్రధాన కార్యదర్శి ఓర్సు కొమురయ్య సహాయ కార్యదర్శి గండికోట రాము పాల్గొని కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం జగన్నాథ్‌పూర్ గ్రామ వడ్డెర సంఘం నూతన కమిటీలో మహిళా అధ్యక్షురాలిగా శివరాత్రి ఈశ్వరమ్మ అధ్యక్షులుగా శివరాత్రి మల్లయ్య గౌరవాధ్యక్షులుగా బొంత అనిల్ ఉపాధ్యక్షులుగా బొంత సది ప్రధాన కార్యదర్శిగా శివరాత్రి మొగిలి కార్యదర్శిగా బొంత సాంబారాజు కోశాధికారిగా శివరాత్రి చిరంజీవి ప్రచార కార్యదర్శిగా కస్తూరి కుమార్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.వారి నాయకత్వంలో జగన్నాథ్‌పూర్ గ్రామంలోని వడ్డెర సంఘం మరింత బలోపేతమై గ్రామాభివృద్ధి మరియు వడ్డెర సమాజ సంక్షేమానికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.