prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 5:05 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జగనన్న పర్యటనను విజయవంతం చేస్తాం – కాకాణి

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 13)  శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.మాజీ మంత్రి కాకాణి ని కలిసి శాలువాలతో సత్కరించి,బొకేలు అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుబోలు మండల నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర రైతు విభాగం స్టేట్ సెక్రటరీ కిషోర్ నాయుడు గారు,వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీ వెంకట రమణారెడ్డి గారు ఇటీవల పదవులు పొందిన సందర్బంగా మునుబోలు మండల నేతల తో కలిసి కాకాణిని కి కృతజ్ఞతలు తెలిపారు,వైఎస్ ఆర్ సీపీ శ్రేణులను అడ్డుకోవడం ఎవరితరం కాదు.జగన్ మోహన్ రెడ్డి గారి కి మత్స్యకారుల ప్రయోజనాలే ముఖ్యం,జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించడం సర్వ సాధారణం  కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల మత్స్యకారులు తమకు అనువైన ప్రదేశాలను కోల్పోతున్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 15వ తేదీన నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి మత్స్యకారుల సమస్యలు తెలుసుకుంటారు. జువ్వలదిన్నెలో మత్స్యకారుల పక్షాన నిలబడనున్న జగన్ మోహన్ రెడ్డి . కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనల పట్ల కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందిజగన్ మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తే ప్రజల నుండి లభిస్తున్న అపూర్వ స్పందన చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు రాగానే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడుతోంది కూటమి పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు,అందుకే జగన్ గారి పర్యటనలకు భారీగా జనం తరలివస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం రకరకాల ఆంక్షలు విధిస్తోంది జగన్ గారి పర్యటనకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం పరిపాటిగా మారింది ​జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతులను అవలంబిస్తోంది సెక్షన్ 30 యాక్ట్ అమలు చేసి, అనవసరంగా ఆంక్షలు విధించి, జనాలను జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనకు రాకుండా,ఇబ్బందులకు గురిచేసేందు ప్రయత్నిస్తుంది పోలీస్ లు ​దారి పొడవునా బారికేడ్లు పెట్టి కార్యకర్తలను ఆపడం, పర్యటనలకు ఆటంకం కలిగించేలా రోడ్లను తవ్వడం, వంటి చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారింది పోలీసుల ద్వారా ఎంతమందిని అడ్డుకున్నా, జగన్ మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానాన్ని ఆపలేరు జగన్ గారి వెనుక ఉన్నది కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించే ‘ఆత్మాహుతి దళం’ లాంటి అభిమాన సైన్యం జగన్ మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ పర్యటించినా ప్రజలే స్వచ్ఛందంగా తరలివస్తున్నారు , రాభోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు  మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరిస్తూ, గత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను,కూటమి ప్రభుత్వం అటకెక్కించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మత్స్యకారుల చిరకాల కోరికైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు జగన్ గారి హయాంలోనే జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 90% పైగా పూర్తయ్యాయి మత్స్యకారుల సౌకర్యార్థం జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నించాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా, మిగిలి ఉన్న స్వల్ప పనులను కూడా పూర్తి చేయడంలో వైఫల్యం చెందింది మత్స్యకారుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది తీర ప్రాంతంలోని విలువైన భూములను మరియు హార్బర్ ప్రాంతాలను ప్రైవేట్ సంస్థలకు (సాగర్ డిఫెన్స్ వంటివి) అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల స్థానిక మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది  జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారుల పడవల నిలుపుదలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి , ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కంటే మత్స్యకారుల ప్రయోజనాలే మాకు ముఖ్యం సాగర్ డిఫెన్స్‌కు సంబంధించిన కార్యకలాపాల వల్ల మత్స్యకారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.హార్బర్‌కు సంబంధించిన సుమారు 79 ఎకరాల స్థలంలో, దాదాపు 29 ఎకరాలు మత్స్యకారులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది మత్స్యకారుల ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ గారు నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌లో నేడు మత్స్యకారులకే చోటు లేకుండా పోతోంది లోకేష్ పేరు మీద వేసిన శిలాఫలకాలను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది జువ్వల దిన్నె ప్రాంతంలో సాధారణ ప్రజలెవ్వరినీ రానివ్వకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ గారిని ప్రజల నుంచి వేరు చేయలేరు.ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జగన్ మోహన్ రెడ్డి గారి కి మద్దతు తెలపనున్నారు ఈ నెల 15వ తేదీ ఉదయం 9:45 గంటలకు జగన్ మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ద్వారా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటారు.హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం, 11:00 గంటలకు .స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మత్స్యకారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, అండగా నిలబడతారు  మధ్యాహ్నం 12:00 గంటలకు జగన్ మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రయాణమై వెళ్తారు  మత్స్యకారులందరూ జగన్ గారి పర్యటనలో పాల్గొని, తమ సమస్యలు జగన్ మోహన్ రెడ్డి గారి కి తెలియజేయాలని కోరుతున్నా కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మత్స్యకారుల పక్షాన పోరాటం ఆపేది లేదు.