ఛార్జింగ్ పెట్టబోయి కరెంటు షాక్… 46 ఏళ్ల వ్యక్తి దుర్మరణం .ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం. .పేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) మొబైల్ ఛార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఒక వ్యక్తి అసువులు బాసిన ఘటన గురువారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపురం గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బుస్సాపురం గ్రామానికి చెందిన పాలెం రవి, 46 గురువారం రాత్రి సుమారు 10:30 గంటలకు నిద్రించే ముందు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగను గమనించకపోవడంతో కరెంటు షాక్ తగిలింది. దీంతో...