చౌదరిగూడ 380 పోలింగ్ బూత్‌లో ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీ

ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ గ్రామం 380 పోలింగ్ బూత్‌ను ఘట్కేసర్ ఎమ్మార్వో శ్రీ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌వో మంజుల, బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)గా విధులు నిర్వహిస్తున్న కే. వినోద్ కుమార్‌ను బూత్‌కు సంబంధించిన వివరాలు, ఓటరు నమోదు ప్రక్రియ, ప్రజలకు పంపిణీ చేస్తున్న దరఖాస్తు ఫారాలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు అవసరమైన అన్ని ఫారాలను అందుబాటులో ఉంచి, ప్రతి ఒక్కరికీ అందజేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న తీరును ఎమ్మార్వో శ్రీ శేఖర్...