prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 9:42 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

చౌదరిగూడెం కాలనీలో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు

ఘట్‌కేసర్, జూలై 24: పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడెం వికర్ సెక్షన్ కాలనీలో వర్షాకాలం కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ వెంటనే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

డిప్యూటీ కమిషనర్ వాణి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి ప్రత్యేక వాహనాన్ని పంపించి విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేలా చర్యలు చేపట్టారు. దీంతో ప్రమాదం తప్పడంతో పాటు కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న డిప్యూటీ కమిషనర్ వాణికి కేశపావుల వినోద్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయడం తమ బాధ్యత అని పేర్కొంటూ, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.