చౌదరిగూడలో పౌర హక్కుల దినోత్సవ అవగాహన సదస్సు

ఘట్‌కేసర్, జూలై 30: ఉమ్మడి ఘట్‌కేసర్ మండలంలోని చౌదరిగూడ పురపాలక సంఘ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డీవీఎంసీ సభ్యుడు తాల్క రాములు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ మండల యువ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ వార్డు సభ్యుడు నర్సింగ్ ముదిరాజ్ హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో పౌర హక్కుల దినోత్సవ అవగాహన...