చౌదరిగూడలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
ఘట్‌కేసర్, జూన్ 30: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పోచారం డివిజన్-8 పరిధిలోని చౌదరిగూడలో మంగళవారం ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) మంజులతో కలిసి యూత్ కాంగ్రెస్ ఘట్‌కేసర్ మండల అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు కావడంతో పాటు, వివరాలను సరిచేసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని...