prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 3:37 am Digital Edition : GIRIBABU KONDHURG

చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్ నియామకం

చేవెళ్లలో బీసీ సేన సమావేశం – శ్రీనివాస్ గౌడ్‌కు నియామకం

చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్ నియామకం

జాతీయ బీసీ సంఘాల అధినేత ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు, జాతీయ బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు.

చేవెళ్ల నియోజకవర్గంలోని కుమ్మెర గేట్ సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీసీ సేన సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు వరప్రసాద్, షాద్నగర్ నియోజకవర్గం బీసీ సేన ఇన్‌చార్జ్ ప్యాట జయ శ్రీకాంత్, షాబాద్ మండల అధ్యక్షుడు దామర్లపల్లి చారి, రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు గిరిబాబు, షాబాద్ బీసీ సేన జనరల్ సెక్రటరీ శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బర్క కృష్ణయ్య మాట్లాడుతూ, “ప్రతి నియోజకవర్గంలో బీసీలను ఎమ్మెల్యే స్థాయి నాయకులుగా తీర్చిదిద్దే వరకు నేను విశ్రాంతి తీసుకోను” అని అన్నారు. గత 40 సంవత్సరాలుగా బీసీలు రాజకీయంగా ఎదగకుండా కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయని, బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

అలాగే గ్రామ, మండల, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో బలమైన నాయకత్వాన్ని తయారు చేయడం బీసీ సేన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా, స్వంత నిధులతో సమావేశాలు నిర్వహిస్తూ బీసీ నాయకత్వాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అప్పారెడ్డి గూడ గ్రామస్థులు రాంచంద్రయ్య, కృష్ణయ్య, శ్రీరాములు, రవీందర్, ఎకబల్, సత్యనారాయణ, సాయి కృష్ణ, ఎస్మాయిల్, ఆంజనేయులు, నర్సింలు, మనీష్ గౌడ్, అవినాష్ గౌడ్, మన్మర్రి మాజీ సర్పంచ్ రాములు, షాక్ చంద్రయ్య, కావలి యాదయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, బీసీ సేన నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.