బెజ్జంకి ,ఏప్రిల్25(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన తిప్పరవేణి రాజయ్య (50), తండ్రి తిప్పరవేణి మైసయ్య, కులం ముదిరాజ్, వృత్తి వ్యవసాయం,శనివారం ఉదయం గ్రామస్తులతో కలిసి పిల్లి వాగు చెక్‌డ్యాం వద్ద చేపలు పట్టడానికి వెళ్లారు.
చేపలు పట్టే సమయంలో ఆయనను ఏదో విషపురుగు కుట్టినట్లు భావిస్తున్నారు. అనంతరం ఆయన నోటి నుండి నురుగు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్ ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడు పరిశీలించగా అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.మృతుడి కుమారుడు తిప్పర వేణి పవన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై ఎలాంటి అనుమానం లేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.