prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 9:49 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

చెరువు బురదలో కూరుకుపోయి బర్ల కాపరి మృతి

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం పశువుల కాపరి ఎలుక లస్మయ్య (65) చెరువులో దిగి, బురదలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి ఎంత వెతికినా దొరకని లస్మయ్య మృతదేహం, శనివారం ఉదయం చెరువులో చేపలు పట్టే వారికి లభ్యమైంది. చెప్పులు, చేతికర్ర ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.