prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 2:00 pm Digital Edition : RAJASHEKARREDDY

చెరువు,వాగు, బావి ల దగ్గర హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ఈత సరదా విషాదంగా మారకూడదు బెజ్జంకి ఎస్సై సౌజన్య

ఈత సరదా విషాదంగా మారకూడదు

బెజ్జంకి ఎస్సై సౌజన్య

బెజ్జంకి,ఏప్రిల్ 22 (ప్రజావాణి)

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, యువకులు చెరువులు, వాగులు వద్ద ఈతకు వెళ్లే సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బెజ్జంకి ఎస్సై సౌజన్య సూచించారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామం చెరువు పరిసర ప్రాంతంలో, అలాగే పలు గ్రామాలలోని వాగులు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు(ఫ్లెక్సీ లు )ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఈత రాని వారు చెరువులు, బావులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు తప్పనిసరిగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలని పేర్కొన్నారు.వేసవి కాలంలో నిర్లక్ష్యం వల్ల నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని,, ప్రజల సహకారంతోనే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని,ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఎ ఎస్సై ఓదయ్య, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి,బెజ్జంకి పోలీసులు పాల్గొన్నారు.