చెరువులు నింపకపోతే వారం రోజుల్లో నిరాహార దీక్ష

*చెరువులు నింపకపోతే వారం రోజుల్లో రోజుల్లో నిరాహార దీక్ష**కోదాడ జూలై 26(ప్రజావాణి*):: నాగార్జుననాగర్ ఎడమ కాలువ ద్వారా కోదాడ నియోజకవర్గంలోని చెరువులను వెంటనే నింపాలని, లేకుంటే వారం రోజుల్లో నిరాహార దీక్షకు కోదాడ దిగుతానని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం మండలం గణపవరం స్టేజి వద్ద రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా రావాల్సిన సాగునీటిని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులకు అందించకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని ఆరోపించారు....