
చెన్నారావుపేట మార్చి 20 ప్రజావాణి
స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీపై వెళ్తున్న కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బదిలీ అయిన సిబ్బందిని కార్యాలయ సిబ్బంది శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి పంపించారు. వారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), మండల పంచాయతీ అధికారి (ఎంపీ ఓ), కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.