ఘట్‌కేసర్, జూలై 4: ఘట్‌కేసర్ విద్యుత్ సెక్షన్ పరిధిలో చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
11 కేవీ ఎన్‌ఎఫ్‌సీ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్‌ఎఫ్‌సీ నగర్ గ్రామం, బొక్కనిగూడ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. అలాగే 11 కేవీ చందుపట్లగూడ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చందుపట్లగూడ, ఎదులాబాద్, కొత్తగూడ, శ్రీరామ పోల్ట్రీ, ఒమేగా కాలేజీ, పోతురాజుగూడ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంది.
వినియోగదారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ (ఇంచార్జ్) ఘట్‌కేసర్ విజ్ఞప్తి చేశారు.