చెంగిచెర్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎస్. స్వాతి బాధ్యతల స్వీకరణ
చెంగిచెర్ల, జూన్ 11: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చెంగిచెర్ల డిపో మేనేజర్‌గా ఎస్. స్వాతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చెంగిచెర్ల డిపో మేనేజర్‌గా విధులు నిర్వహించిన కే. కవిత కంటోన్మెంట్ డిపోకు బదిలీ కావడంతో, ఆమె స్థానంలో జనగామ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్. స్వాతిని నియమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వాతి మాట్లాడుతూ, ప్రయాణికులకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ప్రయాణికుల సంతృప్తినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని, డిపో...