చుమురు మంటల్లో నరేంద్ర మోడీ – ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగా సిపిఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు
ఘట్కేసర్, మే 6 (ప్రజావాణి): కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ అన్నాజిగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద సిపిఐ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, మండల సహాయ కార్యదర్శి సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.3100కు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ పై లీటరుకు రూ.5 చొప్పున, గృహ...