చీలికలు వద్దు.. ఐక్యతే ముద్దు.. రేకొండ యువత చారిత్రాత్మక నిర్ణయం!
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం విలీనం మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సామాజిక ఐక్యతకు సరికొత్త అర్థం చెబుతూ యువత గొప్ప నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాన్ని స్వచ్ఛందంగా రద్దు చేసి, జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం...