చిలాపూర్, రేగులపల్లిలో అర్ధరాత్రి దుండగుల హల్‌చల్ ” దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల దర్యాప్తు
బెజ్జంకి, మే 16 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చిలాపూర్, రేగులపల్లి గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు మహిళల మెడల్లో ఉన్న బంగారు పుస్తెలతాళ్లు గుంజేందుకు పాల్పడిన ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. చిలాపూర్ గ్రామంలో బయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు తాడును దుండగులు అపహరించగా, మరో మహిళ మెడలోని తాడును గుంజే ప్రయత్నం విఫలమైంది. అలాగే రేగులపల్లి గ్రామంలో మరో మహిళ మెడలోని బంగారు తాడును దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు సమాచారం...