బెజ్జంకి, మే 16 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చిలాపూర్, రేగులపల్లి గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు మహిళల మెడల్లో ఉన్న బంగారు పుస్తెలతాళ్లు గుంజేందుకు పాల్పడిన ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.
చిలాపూర్ గ్రామంలో బయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు తాడును దుండగులు అపహరించగా, మరో మహిళ మెడలోని తాడును గుంజే ప్రయత్నం విఫలమైంది. అలాగే రేగులపల్లి గ్రామంలో మరో మహిళ మెడలోని బంగారు తాడును దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదుల మేరకు బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నట్లు బెజ్జంకి ఎస్సై తిరుపతి తెలిపారు.బెజ్జంకి మండలంలోని ఆయా
గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100, బెజ్జంకి పోలీసులకు సమాచారం అందించాలని, రాత్రి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు సూచించారు.