చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. మాజీ కమిషనర్‌తో సహా తొమ్మిది మందిపై వేటు!

పల్నాడు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) చిలకలూరిపేట మున్సిపాలిటీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది.పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును కాజేసిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.నకిలీ రసీదులు సృష్టించి ఏకంగా రూ.34 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటనపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. నకిలీ రసీదులతో నయా దందా.పురపాలక సంఘం పరిధిలో ఆస్తి పన్ను,కుళాయి పన్ను తదితర పన్నులు చెల్లించడానికి వచ్చిన అమాయక ప్రజలకు మున్సిపల్ సిబ్బంది...