prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:44 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

చిత్తూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు…ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు

చిత్తూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్14) చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ,టిడిపి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ షణ్ముగం రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ శ్రీ దొరబాబు.,చూడ ఛైర్పర్సన్ శ్రీమతి కఠారి హేమలత ,మాజీ ఎమ్మెల్యే శ్రీ ఏ.యస్.మనోహర్,టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ వెంకిటీల సురేంద్ర కుమార్ ,మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ కోదండ యాదవ్,మాజీ కార్పొరేటర్ శ్రీ అశోక్ గారు,తెలుగు తమ్ముళ్లు,టిడిపి యస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు.అక్షరాస్యతతోనే దేశ పురోభివృద్ధితో పాటు,ఆర్థిక అసమానతలను తొలగించవచ్చునని నినదించి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి, నేటి ఏపీ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారి వరకు పనిచేస్తోందని చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , టిడిపి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ షణ్ముగం రెడ్డి  తెలిపారు