prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 2:00 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

చిత్తశుద్ధితో ప్రభుత్వ పథకాలను అమలు చేయండి పర్యవేక్షణా లోపం లేకుండా విధులను నిర్వర్తించండి,చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,

చిత్తూరు జిల్లా మే14 ప్రజావాణి న్యూస్   దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్ని స్థాయిల్లో పొదుపు చర్యలు పాటించండి జిల్లా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పారదర్శకంగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం జిల్లాలో మొదటి దశలో 66 ఎస్సీ గ్రామాలను ఎంపిక 10 కోట్లతో 437 పనులను పూర్తి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రా ష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విధులను నిర్వర్తిస్తూ.పర్యవేక్షణా లోపం లేకుండా.తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించి,ప్రభుత్వ పథకాలను అమలు చేసి లక్ష్యాలను చేరుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు జిల్లా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసారు.గురువారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని నాగార్జున IAS వీడియో కాన్ఫరెన్స్ హాలులో చిత్తూరు జిల్లా అభివృద్ధిపై దిశా కమిటీ సమీక్ష నిర్వహించారు,ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ మాట్లాడుతూ ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా వివిధ పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వానికి చెందిన 70 సంక్షేమ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులకు ఆలస్యం లేకుండా చేరేలా చూడాలని జిల్లా యంత్రాంగం, అధికారులను సూచించారు. ప్రతి పథకంలో నిధుల వినియోగం,పనుల అమలు,లబ్ధిదారుల వివరాలు తదితర అంశాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఉండాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు తమ తమ విభాగాల్లో సమగ్ర పర్యవేక్షణ చేపట్టి ఎటువంటి తారతమ్యాలే లేకుండా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.భవిష్యత్తులో ఎవరైనా ప్రశ్నించినా.. సమగ్ర వివరాలు అందించే విధంగా రికార్డుల వ్యవస్థ ఉండాలని తెలిపారు.దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుల నియంత్రణ,పొదుపు చర్యలపై దృష్టి సారిస్తున్నాయని పేర్కొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.ప్రభుత్వ శాఖలలోనే కాకుండా కుటుంబ స్థాయిలో కూడా అనవసరమైన ఖర్చులనుతగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆహార వ్యర్థాన్ని నివారించడం ద్వారా గ్యాస్,ఇతర వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చన్నారు. విదేశీ మారక నిల్వల పరిరక్షణ కోసం బంగారం కొనుగోళ్లు తగ్గించడం,ఇంధన పొదుపు కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు దేశ ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేసుకోవచ్చునన్నారాయన. వచ్చే రోజులలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో అధికారులు ప్రజలకు మార్గనిర్దేశకులుగా వ్యవహరించాలని, పొదుపు చర్యలు వనరుల సంరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అనుబంధ రంగాల అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాయని వాటిపై విస్తృతంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని ఆ ఫలాలను జిల్లా అధికారుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా చేరువ చేయాలన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతికి సంబంధించిన వివరాలను ఎంపీకి తెలియజేశారు.జిల్లాలో ఉన్న సుమారు 3100 చెరువులకు సంబంధించిన శుభ్రపరిచే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్ వివరించారు.గత ఏడాది మంచి వర్షాలు పడినప్పటికీ దాదాపు 1200 చెరువులు 70 శాతం కంటే తక్కువ స్థాయిలో మాత్రమే నిండాయని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయా చెరువుల శుభ్రపరిచే పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు.మట్టి తొలగింపు, కాలువల శుభ్రపరిచే పనులు సమర్థవంతంగా జరిగితే ఈ ఏడాది చెరువులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందన్నారు.అలాగే పనులకు అనుమతులు లభించాయని,లేబర్ పేమెంట్తో పాటు మెటీరియల్ చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. బీటీ రోడ్లు,చెరువుల అభివృద్ధి పనులపై కూడా త్వరలో మరింత దృష్టి సారించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.18 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని,పనుల పురోగతిని అనుసరించి చెల్లింపులు జరుగుతాయని తెలిపారు అదేవిధంగా చిత్తూరు జిల్లాకు వివిధ పథకాల కింద నిధులు వస్తున్నాయని,వాటి వినియోగం ప్రాధాన్యతా పనుల వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు,ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన (PMAGY) కింద, జిల్లాలో మొదటి దశలోని 66 ఎస్సీ గ్రామాలను ఎంపిక చేసి 437 పనులను ఆమోదించడం జరిగింది,ప్రతి ఎస్సీ కాలనీకి సుమారు 20 లక్షలు రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది,342 పనులకు సుమారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది,95 పనులు వివిధ దశాలలో ఉన్నాయి సుమారు నాలుగు కోట్లు బకాయిలు కేంద్ర ప్రభుత్వం నుండి రావలసి ఉన్నది, వివిధ సంక్షేమ పథకాలపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు,పంచాయతీరాజ్,ఆర్ అండ్ బి, విద్య, వైద్యం, విద్యుత్, సంక్షేమ శాఖల,వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో పథకాలపై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ G.శ్రీనివాసులు,జడ్పీ సీఈఓ రవి ప్రకాష్,ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు