చిట్యాల స్వేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలిరావాలి

 ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొత్తపల్లి రవి పిలుపు. తిరుమలాయపాలెం,ప్రజావాణి.. తేలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న చిట్యాల స్వేతకు చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొత్తపల్లి రవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ఆమె మరింత సమర్థవంతంగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు.చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుండే చిట్యాల స్వేతకు మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం రావడం ఎంతో...