prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 5:34 am Digital Edition : VENU THIRUMALAYAPALEM

చిట్యాల స్వేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలిరావాలి

 ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొత్తపల్లి రవి పిలుపు.

తిరుమలాయపాలెం,ప్రజావాణి..

తేలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న చిట్యాల స్వేతకు చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొత్తపల్లి రవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ఆమె మరింత సమర్థవంతంగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు.చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుండే చిట్యాల స్వేతకు మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం రావడం ఎంతో ఆనందకరమని తెలిపారు. ఆమె నియామకం రజక సమాజానికి గర్వకారణమని, మహిళల సమస్యల పరిష్కారంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మే 21న హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అభిమానులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రజక సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొత్తపల్లి రవి కోరారు.చిట్యాల స్వేతకు ప్రజల్లో విశేష ఆదరణ ఉందని, ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం అభినందనీయమని అన్నారు. అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆమెకు తమ ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు.