చిగురుమామిడి లో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా, రాస్తారోకో
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబు దాడులను ఖండించాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించాలని చిగురుమామిడి మండల సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలని కోరారు.సీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ సిలిండర్లతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు...