prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 6:46 am Digital Edition : PRAJA VANI

చిగురుమామిడి నూతన ఎంపీడీఓగా కలికోట రామ్మోహన్ చారి

చిగురుమామిడి నూతన ఎంపీడీఓగా కలికోట రామ్మోహన్ చారి

మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి:
చిగురుమామిడి మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా కలికోట రామ్మోహన్ చారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం రోజున ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన  పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ చారి మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ పనుల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. చిగురుమామిడి మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన కలికోట రామ్మోహన్ చారిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.